మచిలీపట్నం :
కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల విద్యార్థుల కోసం జాతీయ విద్యా విధానం ( ఎన్ ఈ పి 2020) ఆధ్వర్యంలో “డిజిటల్ లిటరసీ & ఇన్నోవేషన్” కార్యక్రమంపై అవగాహన సదస్సు మంగళవారం అకడమిక్ బ్లాక్ నందు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులకు డిజిటల్ పద్ధతులు, సాంకేతికత ఆధారిత బోధన-అభ్యాస విధానాలపై అవగాహన కల్పించడం, విద్యా పరిపాలనలో డిజిటల్ మార్పులను సమర్థవంతంగా వినియోగించేలా ప్రోత్సహించడం.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా “అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ( ఏ బి సి )” పై అవగాహన కల్పిస్తూ, దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు, అమలు విధానం గురించి విద్యార్థులకు వివరించబడింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. బాబు రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, డిజిటల్ పరిజ్ఞానం ప్రస్తుత కాలంలో ఎంతో అవసరమని, ఎన్ ఈ పి 2020 ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్ ఈ పి సార్ధి సమన్వయకర్త డా. సుశీల సమన్వయం చేశారు. అలాగే ఎన్ ఈ పి సార్ధి సభ్యులు ఎస్ రూపా జెస్సికా, పి దుర్గ, ఎస్ తులసి దుర్గా నాగలక్ష్మి కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తమ డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.