మచిలీపట్నం :
ప్రపంచ పశువైద్యల దినోత్సవం పుష్కరించుకొని నగరంలో పశు వైద్యుల దినోత్సవమును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సంచాలకులు డా.ఎస్. నాగభూషణ బాబు విచ్చేసి పశు వైద్యులకు, పోషకులకు అవగాహన కల్పించారు. అలాగే పశు వైద్య పరిరక్షణలో భాగంగా జంతువుల నుండి లభించే పుష్టికర ఆహర పదార్ధాలు గుడ్లు ,పాలు, మాంసం వాటి ప్రముఖ్యతను రైతులకు ప్రజలకు వివరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం పశు వైద్యుల దినోత్సవంను జరుపుకుంటామన్నారు.
విశిష్ట అతిధి డా. ఎన్. చిన్న నరసింహులు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవంను జరుపుకుంటున్నామని, పశువైద్యులు కేవలం జంతువుల ఆరోగ్య సంరక్షణకే కాకుండా, పోషణ ,ఆరోగ్య పరిరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ సంక్షేమం, పాలు, మాంసం వంటి ఆహార పదార్థాల నాణ్యత భద్రత ను వివరించారు. జూనోటిక్ వ్యాధుల నియంత్రణ, (జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులు)
రైతుల ఆర్థికాభివృద్ధి, పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం అని అన్నారు. పశువైద్యుల ఆరోగ్య సేవల వల్ల పశువుల ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. ఈ విధంగా సమాజంలో పశువైద్యులు ప్రధాన భూమిక పోషిస్తూ జంతువులు, పర్యావరణం ఆరోగ్యం పరస్పర సంబంధం ను మెరుగు పరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో డా.స్వామి, వీరంకి మధుబాబు, పూజ, ఏమ్. గోపి, జి. అమూల్య పశు పోషకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.