MachilipatnamLocal News
April 29, 2026
జిల్లా

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిజిటలైజేషన్

  • April 29, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిజిటలైజేషన్

మచిలీపట్నం :

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ) డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా, బ్యాంక్‌కు సంబంధించిన అన్ని సర్క్యులర్లను ఒకే పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే నూతన వ్యవస్థను బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం బుధవారం మచిలీపట్నంలో అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో బ్యాంక్ అందించే అన్ని సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా సిబ్బంది, ఖాతాదారులు మరియు సంబంధిత వర్గాలు బ్యాంక్ సర్క్యులర్లను ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా సులభంగా పొంద వచ్చునన్నారు. కేడీసీసీ బ్యాంక్‌ను ఆధునికీకరించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చైర్మన్ నెట్టెం రఘురాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్యామ్ మనోహర్, జిఎం లు చంద్రశేఖర్, రంగబాబు, డీజీఎం వరలమ్మ, ఏజీఎంలు వాసవి కుమారి, ప్రభా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *