MachilipatnamLocal News
April 16, 2026
జిల్లా

జిల్లాలో జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి –– జిల్లా కలెక్టర్

  • March 31, 2026
  • 0 min read
[addtoany]
జిల్లాలో జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి –– జిల్లా కలెక్టర్
మచిలీపట్నం: 
 
జిల్లాలో వస్తు సేవల పన్నులు (జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
 
మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వసూలు అవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో జరిగే ఆస్తులు, భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేస్తున్నారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. పన్నుల వసూళ్లు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. 
 
సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ జి కల్పన, డిప్యూటీ కమిషనర్ సోనియా తార, సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజకుమార్, జెడ్పి డిప్యూటీ సిఈఓ డాక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణ, గనులు భూగర్భ వనరులు శాఖ ఏడి కొండారెడ్డి, మచిలీపట్నం నగర కమిషనర్ బాపిరాజు, ఆడిట్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *