MachilipatnamLocal News
September 20, 2026
మచిలీపట్నం

వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

  • September 13, 2026
  • 1 min read
వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

మచిలీపట్నం:

వినాయక చవితి పండుగను పర్యావరణానికి హాని కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ వద్ద ఉచిత “మట్టి వినాయక ప్రతిమల” పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాల వల్ల నీరు, పర్యావరణం కలుషితమవుతాయని, అందుకే ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రజలు పెద్ద సంఖ్యలో మట్టి వినాయకులను తీసుకెళ్లి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ భవిరి శంకర్ నాథ్, మాజీ చైర్మన్ టి.ఎస్.ఎస్. బాలాజీ, ట్రెజరర్ పి. సుకుమార్, పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ బి. హనుమంతయ్య, డాక్టర్ ధ్రువ, డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్. హరికృష్ణ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN