MachilipatnamLocal News
May 18, 2026
కృష్ణా జిల్లా

సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఉత్తర్వులు

  • January 21, 2026
  • 0 min read
[addtoany]
సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఉత్తర్వులు
మచిలీపట్నం :
 
       కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక జిల్లా పరిషత్ కార్యాలయాల్లో పనిచేయుచున్న 7 గురు సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చిన ఉత్తర్వులు సిబ్బందికి అందించారు.  
 
      సురేష్ కుమార్ పమిడిముక్కల మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ నుండి మొవ్వ మండలం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదోన్నతి, జగదీష్ కుమార్ పి ఐ యు డివిజన్, కంచికచర్ల మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదోన్నతిను,  గన్నవరం మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న దమయంతి చాట్రాయి మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా   మచిలీపట్నం డివిజన్ కు చెందిన కృష్ణ బాబు ను కృత్తివెన్ను మండల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా , సునీత పిఐయు డివిజన్ విజయవాడ సీనియర్ అసిస్టెంట్ నుండి జిల్లా పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా  దుర్గా మల్లేశ్వరి సీనియర్ అసిస్టెంట్ కంచికచర్ల గా ఉన్న వీరులపాడు మండల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సాయి గోపాల్ జిల్లా పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న గన్నవరం మండల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదోన్నతులు కల్పించి ఉత్తర్వులను సిబ్బందికి అందించారు.
 
         ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కన్నమ నాయుడు, ఉపముఖ్య కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ , పరిపాలనాధికారి తేజస్వి , జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *