MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

ఆర్టీసీ కార్గో & కొరియర్ వినియోగదారులకు శుభవార్త: క్యూఆర్ కోడ్‌తో ముందస్తు బుకింగ్ సదుపాయం ప్రారంభం!

  • October 27, 2026
  • 0 min read
ఆర్టీసీ కార్గో & కొరియర్ వినియోగదారులకు శుభవార్త: క్యూఆర్ కోడ్‌తో ముందస్తు బుకింగ్ సదుపాయం ప్రారంభం!

మచిలీపట్నం:

ఏపీఎస్‌ఆర్టీసి కార్గో మరియు కొరియర్ వ్యాపారంలో చౌక ధరలతో, వేగంగా వస్తువులను, కవర్లను గమ్య స్థానాలకు చేరుస్తూ ప్రజల విశ్వాసాభిమానాలతో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. వినియోగదారుల సౌలభ్యం కొరకు ఎలాంటి ఆవంతరం లేని సేవల కోసం ఎల్లప్పుడూ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు పార్శిల్, కొరియర్లను బుక్ చేయనప్పుడు క్యూర్‌లో వేచి ఉండుటచే సమయము వృథా అవకుండా ఉండేందుకు ఏపీఎస్‌ఆర్టీసి, కృష్ణా జిల్లా వారు నూతనంగా “ప్రీ బుకింగ్ క్యూఆర్ కోడ్”ను ప్రవేశపెట్టడం జరిగింది.

ముందస్తు బుకింగ్ విధానం:

వినియోగదారులు సదరు క్యూఆర్ కోడ్‌ను మొబైల్, కంప్యూటర్, లాప్‌టాప్, ట్యాబ్ వంటి పరికరాలను ఉపయోగించి స్కాన్ చేసి లేదా వెబ్ సైట్ ద్వారా ఎక్కడి నుండైనా సులభంగా పార్శిల్, కొరియర్ వివరాలను కౌంటర్ వద్దకు రాకుండానే ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు. ఆపై బిజినెస్ బుకింగ్ కన్ఫర్మ్ చేసే లింక్‌ను క్లిక్ చేయాలి. వివరాలు నమోదు చేసిన పిదప సరుకు పంపే వారి ఫోన్‌కు ఒక కోడ్ ఎస్ఎంఎస్ వస్తుంది. సదరు ఎస్ఎంఎస్‌లో వచ్చిన కోడ్‌ను ఆర్టీసి బుకింగ్ కౌంటర్ వద్ద చూపించి త్వరితంగా బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సేవలు కృష్ణా జిల్లాలోని అన్ని డిపోలలోనూ అందుబాటులోకి వచ్చాయి.

ప్రారంభోత్సవ వివరాలు:

ఈ కార్యక్రమాన్ని ప్రారంభస్తూ కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు క్యూఆర్ కోడ్ ఉపయోగించే విధానాన్ని వివరించారు. ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తమ సరుకులు, కవర్లు సులభంగా ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పీడీ ఇన్ చార్జ్ టి.ఎస్.ఆర్. గోపాల్, కార్గో డిఎమ్ఈ సి.హెచ్.నాగేశ్వర రావు, ఎంటీఎమ్ బస్ స్టేషన్ మేనేజర్, కార్గో సిబ్బంది, ఆర్టీసి ఉద్యోగులు, వినియోగదారులు పాల్గొన్నారు.

About Author

SSN