రిమాండ్ ఖైదీ కుమారునికి రూ.5 లక్షల నష్ట పరిహార చెక్కు పంపిణీ
మచిలీపట్నం:
2023 సంవత్సరం మే 6వ తేదీన అవనిగడ్డ సబ్ జైలులో ఉంటూ మృతి చెందిన రిమాండ్ ఖైదీ కుమారునికి రూ.5 లక్షల పరిహార చెక్కు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందజేశారు.
మచిలీపట్నం నగరంలోని తన ఛాంబర్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో మృతి చెందిన పులి కోటేశ్వరరావు అలియాస్ కోటి (వీర్రాజు కుమారుడు) కుటుంబ సభ్యులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సిఫారసుల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారానికి సంబంధించిన రూ.5 లక్షల చెక్కును మృతి చెందిన ఖైదీ కుమారుడు పులి చైతన్య కు జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మానవ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్‌హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాల మేరకు బాధిత కుటుంబానికి పరిహారం అందించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ మేజిస్ట్రేట్ విభాగం సిబ్బంది ప్రదీప్ పాల్గొన్నారు.

