MachilipatnamLocal News
July 14, 2026
మచిలీపట్నం

రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి.! – అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్

  • June 25, 2026
  • 0 min read
[addtoany]
రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి.! – అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత అగర్వాల్

మచిలీపట్నం:

పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్ పలు ప్రాంతాల్లో పర్యటించి చెత్త ఎక్కువగా రోడ్లమీద వేసే ప్రదేశాలను గుర్తించి, కిందిస్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

నమ్రతా అగర్వాల్ మాట్లాడుతూ సచివాలయల సిబ్బంది రోడ్లమీద చెత్త వేసే వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా ప్రజల భాగస్వామ్యంతో అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రతతో ఉండేలా చూసుకోవాలన్నారు. శానిటేషన్ సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఆ చెత్తను శానిటేషన్ సిబ్బందికి అందజేసేలా సహకరించాలన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. శుభ్రతే మన ఆరోగ్యానికి పునాది అన్నారు.

నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ ఎం. గోపాల్ రావు, మున్సిపల్ డి ఈ కృష్ణ, మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకుల మహేశ్వరరావు, 45 డివిజన్ సచివాలయ శానిటేషన్ సెక్రటరీ మానస, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్,
పి. వి. ఫణి కుమార్, భాను ప్రసాద్, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

About Author

SSN