ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పరీక్షల నిర్వహణ
మచిలీపట్నం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి Rc.No.92/C1/PAT/2026, తేదీ 12.11.2026 ప్రకారం, అర్హత కలిగిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ (PAT), గ్రేడ్-II పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్పెషల్ టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పరీక్షలు మరియు గ్రేడ్-I పండితులకు సింపుల్ ఓరియంటేషన్ టెస్ట్ డిసెంబర్ 2026లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరుకాదలచిన ఉపాధ్యాయులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పరీక్ష ఫీజు మరియు దరఖాస్తు గడువులు
* ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు రూ. 200/- చెల్లించడానికి చివరి తేదీ: 20.11.2026
* ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 21.11.2026
* రూ. 60/- ఆలస్య రుసుముతో (మొత్తం రూ. 260/-) పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 24.11.2026
* ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 25.11.2026
* DEO కార్యాలయం ద్వారా దరఖాస్తులు, NRs మరియు ఫిగర్ స్టేట్మెంట్ సమర్పించడానికి చివరి తేదీ: 27.11.2026
అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలియజేశారు.

