MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు కోలాట ప్రదర్శన

  • May 21, 2026
  • 0 min read
[addtoany]
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు కోలాట ప్రదర్శన

మచిలీపట్నం:

స్థానిక ఈడేపల్లిలో వేంచేసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సింగరాజు దివాకర్ ఆదిశంకరాచార్య ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జోగి శివ శంకర్ ప్రసాద్ మహిళా శిశు బృందం చే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 మంది బాలికలు అనేక పాటలతో కోలాటం నిర్వహించారు. ప్రత్యేక అంశంగా భగవద్గీత కోలాటం, జడ కోలాటం 16 మంది బాలికలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వందలా మంది ప్రేక్షక భక్తులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About Author

SSN