MachilipatnamLocal News
April 18, 2026
మచిలీపట్నం

పోషణ పక్వాడ పై అవగాహన సదస్సు

  • April 17, 2026
  • 0 min read
[addtoany]
పోషణ పక్వాడ పై అవగాహన సదస్సు
మచిలీపట్నం :
 
 మచిలీపట్నం 19వ డివిజన్ రిక్షా డ్రైవర్స్ కాలనీ నందు ఉన్న అంగన్వాడి కేంద్రం లో జాతీయ ఎనిమిదవ పోషణ పక్షోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణపురం సెక్టార్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ నిర్మల మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఉడికించిన పప్పు ధాన్యాలు వాటి యొక్క విలువలు ఉపయోగాల గురించి వివరించారు. 
 
19వ వార్డు ఏ ఎన్ ఎం భవాని మాట్లాడుతూ పిల్లలను ఎక్కువగా ఆకర్షించే కురుకురే, లేస్ మొదలైన ప్యాకెట్ ఫుడ్లను నివారించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ అంగన్వాడీ కార్యకర్తలు పద్మావతి, వి ఎమ్ స్వర్ణలత, అంగన్వాడి ఆయాలు,  ఎస్.కె రంజాన్ భి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *