MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో మత్స్యకారులకు ఆయిల్ కార్డుల పంపిణీ

  • October 5, 2026
  • 0 min read
మచిలీపట్నంలో మత్స్యకారులకు ఆయిల్ కార్డుల పంపిణీ

మచిలీపట్నం:

మచిలీపట్నం మండలం పెద్దకానూరు గ్రామంలో బోటు యజమానులకు సోమవారం ఆయిల్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 మంది బోటు యజమానులకు ఆయిల్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మత్స్యకారులకు లీటర్ డీజిల్‌పై రూ. 9 సబ్సిడీని అందిస్తున్నామని, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు సబ్సిడీ డీజిల్ లభిస్తుందని తెలిపారు. అలాగే, వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక భృతిని అందిస్తూ అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తోందని సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇతర పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ బండి వీరస్వామి, నాయకులు పీత రాము, బొమ్మిడి పెద్ద ఏడుకొండలు, బోటు యజమానులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN