MachilipatnamLocal News
April 15, 2026
జిల్లా

మార్చి 24 మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు

  • March 22, 2026
  • 1 min read
[addtoany]
మార్చి 24 మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు
మచిలీపట్నం : 
 
       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (DSA) కృష్ణా నిర్వహిస్తున్న సాప్ లీగ్స్లో భాగంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు మార్చి 24, 2026 మంగళవారం న మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించ బడనున్నాయి.
 
       ఈ పోటీల్లో 35+, 45+ వయో విభాగాల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. జిల్లాలో నిర్వహించే ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు 2026 మార్చి 30, 31 తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరులో నిర్వహించబడే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే
అవకాశం పొందుతారు.
 
       పాల్గొనదలచిన క్రీడాకారులు సాప్ అధికారిక వెబ్సైట్ https://sports.ap.gov.in/#/home/saapleague లో నమోదు చేసుకోవాలి. నమోదు చేయడంలో
ఇబ్బందులు ఎదురైతే డి.ఎస్.ఏ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని జిల్లా స్పోర్ట్స్ అధికారి ఝాన్సీ లక్ష్మి  ప్రకటనలో తెలిపారు 
 
       రాష్ట్ర స్థాయి పోటీలలో 100 మీ., 400 మీ., 800 మీ., 1500 మీ. పరుగులు, లాంగ్ జంప్, హై జంప్, షాట్పుట్, డిస్కస్, జావెలిన్ త్రో మరియు 4×100 మీ టర్ల రిలే క్రీడాంశాలు నిర్వహించబడతాయి. జిల్లాలోని అన్ని వేటరన్ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొని మాస్టర్స్ క్రీడలను ప్రోత్సహించాలని, అలాగే ప్రేక్షకులు కూడా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరచాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *