MachilipatnamLocal News
September 22, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో రూ.51 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన: మంత్రి కొల్లు రవీంద్ర

  • September 22, 2026
  • 1 min read
మచిలీపట్నంలో రూ.51 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం :

రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 51 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, కూటమి నాయకులు, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ‘హ్యామ్’ (HAM) ప్రోగ్రామ్ కింద 26 జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.

పనుల కేటాయింపు వివరాలు

 * రూ. 27 కోట్లు: సీసీ రోడ్ల నిర్మాణం.

 * రూ. 15 కోట్లు: పార్కులు, శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పన.

 * రూ. 7.50 కోట్లు: మున్సిపల్ కార్యాలయం, పాలక మండలి సమావేశ మందిర నిర్మాణం

గతంలో డిఎఫ్ఐడి (DFID) నిధుల నుంచి రూ. 35 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 13 కోట్లు, అమృత్ (AMRUT) పథకం కింద రూ. 75 కోట్లు తీసుకువచ్చి తాగునీటి ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STP) నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. నగరాన్ని 100% సీసీ రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు భారీ స్థాయిలో నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మంత్రి నారా లోకేష్‌లకు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Author

SSN