MachilipatnamLocal News
April 9, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో ఆదర్శ ప్రేమ వివాహం – ప్రేమకు కొత్త నిర్వచనం

  • April 7, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నంలో ఆదర్శ ప్రేమ వివాహం – ప్రేమకు కొత్త నిర్వచనం
మచిలీపట్నం :
 
మచిలీపట్నంలో ఒక యువతి తన ప్రేమను నిలబెట్టుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ప్రేమకు రూపం, ఎత్తు, అందం వంటి భేదాలు లేవని, కులం–మతం కూడా అడ్డుకావని ఈ జంట మరోసారి నిరూపించింది. 
రాజుపేటకు చెందిన యువతి, మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది. యువకుడు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, యువతి మెడికల్ షాప్‌లో పనిచేస్తోంది. ప్రేమలో ఎలాంటి అడ్డంకులు లేవని నమ్మిన ఈ జంట తమ నిర్ణయంపై నిలబడింది. 
అయితే ఈ ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లభించలేదు. యువతి తల్లిదండ్రులు, బంధువులు ఈ వివాహానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనితో యువజంటకు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగింది. తమ ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో యువజంట ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరింది. ప్రేమకు హద్దులు లేవని, నిజమైన అనుబంధం ఉంటే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దాటవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *