MachilipatnamLocal News
March 1, 2026
కృష్ణా జిల్లా

మచిలీపట్నంలో మొదటి కార్నియా కంటి నేత్రదానం

  • February 14, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నంలో మొదటి కార్నియా కంటి నేత్రదానం
మచిలీపట్నం :
 
       ఇటీవల కృష్ణా జిల్లా లోని మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేత్ర దాన కేంద్రంను ప్రారంభించారు. శనివారం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మొదటిసారిగా కార్నియా కంటి నేత్రదానం చేశారు. ఈ కార్నియా నేత్రదానం ప్రభుత్వాసుపత్రిలో మొట్ట మొదటిగా నమోదయింది. 
        సేకరించిన వివరాల ప్రకారం అబ్దుల్ అల్లాబక్షు అనే మచిలీపట్నం వాసి విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరణించిన వ్యక్తి వద్ద నుండి కుటుంబ సభ్యుల అనుమతితో కార్నియాను సేకరించారు. సేకరించిన నేత్రాలను అగర్వాల్ కంటి ఆసుపత్రి నేత్ర నిధి కి పంపించారని అని, కృష్ణా జిల్లా అంధత్వ నివారణ అధికారి ,ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.భానుమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అగర్వాల్ కంటి ఆసుపత్రి సిబ్బంది ప్రవీణ్ ,డా. జ్యోస్న తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *