కృత్తివెన్నులో అక్రమంగా గోవుల రవాణా: 19 ఆవులను అడ్డుకున్న RSS, BJP నాయకులు
పెడన :
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పరిధిలోని కృత్తివెన్ను మండలంలో గురువారం అక్రమంగా తరలిస్తున్న 19 గోవుల వాహనాన్ని స్థానిక నాయకులు అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గోవులను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో PACS చైర్మన్ కూనసాని నాగబాబు, RSS మరియు BJP నాయకులతో కలిసి కృత్తివెన్ను హైవేపై రవాణాను అడ్డుకున్నారు. వెంటనే నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో, పోలీసులు రంగానికి చేరుకుని AP 39 WH 2067 నంబర్ గల టాటా వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తుని నుంచి నెల్లూరుకు రవాణా
ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బిజెపి నాయకులు మరియు PACS చైర్మన్ కూనసాని నాగబాబు మాట్లాడుతూ… ఈ గోవులను తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి నెల్లూరుకు చట్టవిరుద్ధంగా తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, కఠినమైన చట్టాలు అమలు చేయాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసు నమోదు – డాక్టర్ల పరీక్షలు
ఈ ఘటనపై కృత్తివెన్ను ఎస్సై పైడి బాబు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. గోవులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ రవాణాకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటనా స్థలానికి కృత్తివెన్ను మండల వెటర్నరీ డాక్టర్ సుష్యంతు తన సిబ్బందితో వచ్చి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్యంతు మాట్లాడుతూ… పట్టుబడిన 19 గోవులు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ. 10 लाखల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

