కాలభైరవ స్వామికి అమావాస్య ప్రత్యేక పూజలు
మచిలీపట్నం జోడిగుళ్ల దేవస్థానంలో ఘనంగా అభిషేకాలు, అలంకరణలు
మచిలీపట్నం :
అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలోని ప్రముఖ జోడిగుళ్ల దేవస్థానం ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు అలంకరణలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
పంచామృతాలు, ద్రాక్షరసంతో ప్రత్యేక అభిషేకం
ఆలయ ప్రధాన అర్చకులు హరి వెంకట రామచంద్ర శాస్త్రి బ్రహ్మత్వంలో స్వామివారికి పంచామృతాలు, ద్రాక్షరసంతో ప్రత్యేక అభిషేకాలు జరిపారు. అనంతరం కాలభైరవ స్వామికి నూతన వస్త్రాలు సమర్పించి, వడమాలలు మరియు రంగురంగుల పూలదండలతో కన్నులపండువగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
లడ్డు వేలం విజేతకు ఘన సత్కారం
ఇటీవల సాగర తీర వినాయక పందిరిలో రూ. 25 లక్షలు వెచ్చించి వినాయకుడి లడ్డును పాడుకున్న గుమ్మడి భవాని శంకర్ ను ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వీరబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జోగి రామకృష్ణ, ప్రముఖులు అచ్యుతరామయ్య, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు విశేషంగా పాల్గొన్నారు.

