MachilipatnamLocal News
June 25, 2026
అవనిగడ్డ

ఘంటసాల పోలీస్ స్టేషన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

  • March 8, 2026
  • 1 min read
[addtoany]
ఘంటసాల పోలీస్ స్టేషన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ఘంటసాల, 8 మార్చి 2026, SSN:
       మహిళలు అన్ని రంగాల్లో రాణించి దేశానికి ఆదర్శవంతంగా నిలవాలని చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు సతీమణి రోజా అన్నారు. 
     ఘంటసాల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వేమన చందన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
      ఈ సందర్భంగా ఎస్ఐ చందన చల్లపల్లి సీఐ సతీమణి రోజా, చల్లపల్లి, మోపిదేవి ఎస్ఐల సతీమణులు దుర్గా భవాని, దివ్య, ఎస్ఐ చందన బామ్మ సుబ్బలక్ష్మీలతో పాటు స్టేషన్లోని మహిళా హోమ్ గార్డులు, కానిస్టేబుల్స్ సతీమణులను నూతన వస్త్రాలందించి ఘనంగా సత్కరించి అందరికి మహిళా ధినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 
      ఘంటసాల పెద్దగూడెంకు చెందిన జైజీవన్ యూత్ సభ్యులు మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వేమన చందన. మహిళా హోమ్ గార్డులు రజనీ, సుష్మలను దుశ్శాలువాలతో సత్కరించి పూలబొకేలు, క్రోటాన్ మొక్కలు, నార సంచులు అందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *