MachilipatnamLocal News
July 20, 2026
పోలీస్ & లీగల్ డైరీ

ఘంటసాల పరిధిలో కోడి పందాలు – ఇద్దరు అరెస్టు

  • March 2, 2026
  • 0 min read
[addtoany]
ఘంటసాల పరిధిలో కోడి పందాలు – ఇద్దరు అరెస్టు
అవనిగడ్డ :
 
        ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కోడి పందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ చందన ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించగా, కోడి పందాలు ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
 
         వారి వద్ద నుండి నగదు మరియు కోడి పందాలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ చందన తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *