MachilipatnamLocal News
April 15, 2026
జిల్లా

పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ

  • March 30, 2026
  • 0 min read
[addtoany]
పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ
మచిలీపట్నం :
 
కృష్ణాజిల్లా డిఇఓ యు వి సుబ్బారావు సోమవారం పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం నిర్వహించిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష సందర్భంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. మచిలీపట్నం మండలంలోని సెయింట్ జాన్స్ హై స్కూల్, సిపిఎంహై స్కూల్, భాష్యం హై స్కూల్, బాలాజీ విద్యాలయం, నగరపాలక సంస్థ హై స్కూల్ దేశాయిపేట, నారాయణ హై స్కూల్ వంటి రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా, భాష్యం హై స్కూల్, బాలాజీ హై స్కూల్ మరియు నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్న మూడు ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించారు.
మొత్తం 9 పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన అనంతరం, పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *