దోమల నివారణ చర్యలు – ఆయిల్ బాల్స్ వినియోగం
మచిలీపట్నం :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా దయాకర్ మరియు జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ ఆదేశాల మేరకు, నారాయణపురం పరిధిలోని 1వ సచివాలయం, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో నిల్వ ఉన్న మురుగు నీటిలో దోమల లార్వా వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రాఘవేంద్ర, సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్లు ప్రవీణ్ మరియు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజలకు సూచనలు
పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పనికిరాని కొబ్బరి చిప్పలు, టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలు మరియు ఇతర వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా తొలగించాలి. దోమల వృద్ధిని అరికట్టి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

