MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

దామోదరం సంజీవయ్య – 105వ జయంతి వేడుకలు

  • February 14, 2026
  • 1 min read
[addtoany]
దామోదరం సంజీవయ్య – 105వ జయంతి వేడుకలు

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

మచిలీపట్నం :
 
          ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్‌లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవిన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
 
          ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, దామోదరం సంజీవయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించడం ఆయన పట్టుదల, కృషి, నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. 
 
         ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి సాహిద్ బాబు, వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొని సంజీవయ్య కు ఘన నివాళులు అర్పించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *