MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • November 14, 2026
  • 0 min read
మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

 * యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశం

 * విజయవాడ కార్పొరేషన్ యంత్రసామగ్రి, నిపుణుల సహకారం

మచిలీపట్నం:

నగరంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రవీణ్ తదితర అధికారులతో కలిసి నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్, సాయిబాబా సెంటర్, బందరు బస్టాండ్ సెంటర్, కోనేరు సెంటర్, కోర్టు రోడ్డు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వర్షాలు కురిసినప్పుడు రెండు మూడు రోజుల వరకు రోడ్లపైనే మురుగు, వర్షపు నీరు నిలిచిపోతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రధాన డ్రైనేజీ మార్గాల్లో అడ్డంకులను తొలగించి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. యంత్రసామగ్రి, సాంకేతిక సిబ్బంది కొరతను అధిగమించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. కలెక్టర్ అభ్యర్థన మేరకు తాత్కాలిక ప్రాతిపదికన ఆధునిక యంత్రసామగ్రి, సాంకేతిక నిపుణులను పంపేందుకు విజయవాడ కమిషనర్ అంగీకరించారు. తాత్కాలిక ఉపశమనంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

About Author

SSN