MachilipatnamLocal News
April 3, 2026
జిల్లా

బాణాసంచా పేలి పోలీసు సిబ్బంది గాయపడటం బాధాకరం: మంత్రి కొల్లు రవీంద్ర

  • March 31, 2026
  • 0 min read
[addtoany]
బాణాసంచా పేలి పోలీసు సిబ్బంది గాయపడటం బాధాకరం: మంత్రి కొల్లు రవీంద్ర
ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఎస్ఐ, కానిస్టేబుళ్లను పరామర్శించిన మంత్రి రవీంద్ర, వీరంకి గురుమూర్తి, మండలి వెంకట్రామ్
 
మంగళగిరి:
 
       బాణాసంచా పేలి పోలీస్ సిబ్బంది గాయపడటం బాధాకరం అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషనులో బాణాసంచా పేలిన ఘటనలో తీవ్ర గాయాలకు గురై మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి ఎస్ఐ డీ.దుర్గా ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, కానిస్టేబుల్ డీ.నాగరాజులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎస్ఐ, కానిస్టేబుళ్లకు అందిస్తున్న చికిత్స, వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *