MachilipatnamLocal News
July 19, 2026
మచిలీపట్నం

అనాధ మహిళకు వివాహం చేసి ఆదర్శం చాటిన కిరణ్ పాల్ దంపతులు.!

  • July 6, 2026
  • 0 min read
[addtoany]
అనాధ మహిళకు వివాహం చేసి ఆదర్శం చాటిన కిరణ్ పాల్ దంపతులు.!

“బెరాకా” వసతి గృహంలో ఘనంగా వివాహ వేడుక నిర్వహించిన బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి ఎస్ కిరణ్ పాల్ దంపతులు.!

మచిలీపట్నం:

సోమవారం బెరాక మినిస్ట్రీస్ వసతి గృహంలో ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసించిన శాంతి అనే మహిళకు డాక్టర్ బి. ఎస్.కిరణ్ పాల్ దంపతులు దగ్గరుండి తల్లి, తండ్రి బాధ్యతలు వహించి వివాహం జరిపించారు. తమ వసతి గృహం లోనే విద్యను అభ్యసించిన విద్యార్థిని శాంతి వివాహం నాగమల్లేశ్వరరావు తో బెరాక మినిస్ట్రీస్ సమావేశ మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కిరణ్ పాల్ మాట్లాడుతూ తమ బెరాకా మినిస్ట్రీస్ వసతి గృహంలో చదువుకున్న పాప శాంతికి, తాను దగ్గరుండి పెండ్లి జరిపించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో కూడా తమ వసతి గృహంలో చదువుకున్న అనాధ మహిళకు వివాహం జరిపించడం జరిగిందన్నారు. పెండ్లి కుమారుడు నాగమల్లేశ్వరరావు, శాంతి దంపతులు అరమరికలు లేకుండా చక్కని దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు. వివాహం ద్వారా చక్కని కుటుంబం ఏర్పడుతుందని ఆ కుటుంబం ద్వారా నూతన వధూవరులు భద్రత, భరోసా పొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. నూతన జంట ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని పిల్లాపాపలతో హాయిగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు విచ్చేసిన అతిధులకు, స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయ విందు అందించారు.

ఈ వివాహ వేడుకలో అరిసేపల్లి ఇంచార్జ్ అల్లూరి విశ్వప్రసాద్, పట్టణ టిడిపి అధ్యక్షులు లోగిశెట్టి స్వామి ,సంస్థ ప్రతినిధులు, కార్యనిర్వాహక సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author

SSN