రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కారుమూరి, చేబ్రోలు.
మచిలీపట్నం:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులుగా కారుమూరి రాజేంద్రప్రసాద్, కార్యదర్శిగా చేబ్రోలు ఆశీర్వాదం ఎన్నికయ్యారు. శనివారం సంఘ భవనంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఎన్నికలు జరిగాయి. జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా సిహెచ్ గంగాజలరావు, కే ఆదినారాయణరావు, ఉపాధ్యక్షులుగా వివి కృష్ణారావు, ఎస్ రాఘవరావు, కే ఫణిభూషణరావు, వై దుర్గారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎల్ వెంకటేశ్వరరావు, ఎం సత్యనారాయణ, కార్యదర్శులుగా సిహెచ్ ప్రమీల, బికే దుర్గారావు, ఎస్ వెంకటేశ్వరరావు, ఎం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఏ శంకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాష్ట్ర కార్యదర్శి జి జయబాబు సహాయ ఎన్నికల అధికారి షహీనుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, డి ఆర్ బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, మొవ్వ, పమిడిముక్కల, పామర్రు, పెడన బంటుమిల్లి యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

