ఊడిపడిన మహిళా న్యాయవాదుల గది స్లాబు పెచ్చులు…
మచిలీపట్నం:
గురువారం ఉదయం జిల్లా కోర్టు పరిధిలోని మహిళా న్యాయవాదుల గది స్లాబ్ పెచ్చు ఒక్కసారిగా ఊడిపడింది. వేసవి సెలవులు కావడం వల్ల ఆ సమయంలో సభ్యులెవరూ గదిలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే గదిలోని ఫర్నిచర్ కొంతమేర ధ్వంసం అయింది. బిల్డింగ్ నిర్మాణం జరిగి దాదాపు 35 సంవత్సరాలు గడిచినట్లు తెలుస్తుంది. ఆర్ & బి అధికారుల పర్యవేక్షణా లోపం, సరైన మరమ్మత్తులు జరపకపోవడం వల్ల ఘటన జరిగినట్లుగా పలువురు న్యాయవాదులు విమర్శిస్తున్నారు.

ఈ సంఘటనపై స్పందించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు, ప్రధాన కార్యదర్శి సర్వా లలితా కుమారి…. తక్షణమే బార్ అసోసియేషన్ కు నిధులు కేటాయించి నూతన బిల్డింగ్ నిర్మాణం చేయాలని ఉన్నతాధికారులను కోరారు.

