MachilipatnamLocal News
July 20, 2026
పోలీస్ & లీగల్ డైరీ

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం”కు మొత్తం 52 ఫిర్యాదులు

  • June 1, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం”కు మొత్తం 52 ఫిర్యాదులు

మచిలీపట్నం :

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ స్వీకరించారు. ప్రతి ఒక్కరితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మొత్తం 52 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఉద్యోగ మరియు వ్యాపార మోసాలు, ఇతర వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

About Author

SSN