MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

కానిస్టేబుల్ షేక్ ఇబ్రహీం సస్పెన్షన్..

  • May 25, 2026
  • 0 min read
కానిస్టేబుల్ షేక్ ఇబ్రహీం సస్పెన్షన్..

డీజీపీకి మహిళ ఫిర్యాదు.. ఎస్పీ చర్యలు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీంను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ అతనిపై అవినీతి ఆరోపణలు చేస్తూ నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డీజీపీ కార్యాలయానికి చేరిన ఫిర్యాదును విచారణ నిమిత్తం కృష్ణా జిల్లా పోలీస్ ఉన్నత అధికారులకు బదిలీ చేశారు. ప్రాథమిక విచారణలో వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, కానిస్టేబుల్ షేక్ ఇబ్రహీంను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.

About Author

SSN