MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  • May 20, 2026
  • 1 min read

మచిలీపట్నం :

ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 1992లో ప్రారంభమైన ఈ సంస్థ దేశంలోని 11 హ్యాండ్‌లూమ్ ఇనిస్టిట్యూట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కోర్సులో శిక్షణ పొందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించబడనున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ (ఎంపీసీ) లేదా రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన వారు నేరుగా రెండవ సంవత్సరంలో చేరే అవకాశం ఉంది.ఈ కోర్సు అభ్యసించే విద్యార్థులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నెలకు రూ.2,500 స్టైపెండ్ అందించబడుతుంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడటంతో పాటు, చేనేత మరియు జౌళి శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉంటాయి.అలాగే ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత విద్య కొనసాగించాలనుకునే వారు డిప్లొమా అనంతరం నేరుగా బీటెక్ రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు.ఇతర వివరాల కోసం www.iihtvgr.com ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 9399936872, 9866169908 నంబర్లను సంప్రదించవచ్చు అని తెలిపారు.

About Author

SSN