MachilipatnamLocal News
May 24, 2026
మచిలీపట్నం

క్యాన్సర్ పై 200 మంది గ్రామీణ వైద్యులకు ప్రత్యేక అవగాహన

  • May 9, 2026
  • 0 min read
[addtoany]
క్యాన్సర్ పై 200 మంది గ్రామీణ వైద్యులకు ప్రత్యేక అవగాహన

మచిలీపట్నం:

స్థానిక ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో గుంటూరు తక్కెళ్లపాడు కేంద్రంగా సేవలందిస్తున్న కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నేపథ్యంలో ప్రజల్లో మరియు గ్రామీణ వైద్యుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్ ఎండీ, మెడికల్ ఆంకాలజిస్ట్ డీఎం డాక్టర్ రాము కందుల, జనరల్ మెడిసిన్ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ చౌదరి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పాల్గొని క్యాన్సర్ వ్యాధుల లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రారంభ దశలో గుర్తింపు, ఆధునిక చికిత్స విధానాలపై వివరించారు.

సుమారు 200 మంది గ్రామీణ వైద్యులకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ బాధితులను త్వరగా గుర్తించి సరైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని వైద్య నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి కమిటీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి.ఆర్. ఆంజనేయులు ను ఘనంగా సత్కరించారు వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందగోపాల్, డేవిడ్ రాజు, కోటేశ్వరరావు, సందీప్ కుమార్, అర్జున్ రావు ,జవహర్, పీటర్ హరిప్రసాద్, రాజేష్ ,దుర్గారావు పి.ఎస్.ఐ ఖాన్, రత్తయ్య, దత్తు, శేషగిరి, వాసుదేవ, మూర్తి, దాసు, విజయ సాయి, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *