MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

నగరంలో ఘనంగా రెడ్ క్రాస్ దినోత్సవం

  • May 8, 2026
  • 0 min read
[addtoany]
నగరంలో ఘనంగా రెడ్ క్రాస్ దినోత్సవం

మచిలీపట్నం:

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పరాసుపేటలోని పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ డి ఆర్ కే ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై తొలుత రెడ్ క్రాస్ స్థాపకులు మొట్టమొదటి నోబెల్ శాంతిబహుమతి విజేత సర్ డ్యూనాట్ హెన్రీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వడదెబ్బ నివారణ చర్యల కరపత్రమును ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నిర్మూలన చేసే ఉద్దేశంతో వి సుందర రామ్ గారి సౌజన్యంతో పలువురికి ఎంసీ నెంబర్ స్టీల్ వాటర్ బాటిల్ లు పంచారు. ఎస్ఎస్సి లో అత్యధిక మార్కులు సాధించిన బ్లడ్ సెంటర్ సిబ్బంది పిల్లలు అబ్దుల్ నసరత్ (562 మార్కులు), సూర్య వినిత్ రామ్ (550 మార్కులు) లకు ₹5000, ₹1116 రెడ్ క్రాస్ సెక్రటరీ శంకర్ నాధ్ ఆర్థిక సౌజన్యంతో అందజేశారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలకు తోడ్పడుతున్న డి ఆర్ ఓ కే చంద్రశేఖర్ రావుకు చైర్మన్, సెక్రటరీ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియపరచారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ శంకర్ నాధ్, కోశాధికారి సుకుమార్, కమిటీ సభ్యులు సుందర్ రామ్, డాక్టర్ వీరేంద్రనాథ్, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హనుమంతయ్య, డాక్టర్ శివప్రసాద్, ఎస్ ఆఫ్ శివ మెంబర్ బాబురావు, పలువురు రెడ్ క్రాస్ కార్యకర్తలు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *