MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

  • May 6, 2026
  • 0 min read
[addtoany]
మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత్త చుక్కపల్లి సురేష్ ఆర్ధిక సహకారంతో అభివృద్ధి

దహన సంస్కారాల కోసం వచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

మచిలీపట్నం:

మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికలో ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి సురేష్ ఆర్ధిక సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు తో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అంతిమ సంస్కారాల నిర్వహణకు వచ్చే వారికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చిన చుక్కపల్లి రమేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో శ్మశానవాటికల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని 16 ఎకరాల శ్మశాన వాటిక కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలకు గురవుతోంది. ఈ నేపథ్యంలో శ్మశానాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చుక్కపల్లి రమేష్ ముందుకొచ్చి సరైన సదుపాయాలు లేకపోవడంతో కరోనా సమయంలో మృతదేహాల ఖననానికి అనేక ఇబ్బందులు చూశాం.

సామాజిక బాధ్యతగా తెలంగాణలో పలు అభివృద్ధి పనులు చేస్తున్న చుక్కపల్లి సురేష్ ని మచిలీపట్నం అభివృద్ధికి సహకరించాలని కోరగా.. బందరు శ్మశానవాటిక అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం. రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి, మచిలీపట్నంలో మూడు శ్మశాన వాటికల్లో క్రిమేషన్ కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు, భౌతిక దేహాలను ఉంచేందుకు వీలుగా పలు నిర్మాణాలు చేపడుతున్నారు. అదే సమయంలో శ్మశానంలో రోడ్లు, డ్రైనేజీలను మున్సిపాలిటీ నిధులతో అభివృద్ధి చేస్తాం.

శ్మశానం పరిసరాల్లో స్నానానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఈ శ్మశాన వాటికను ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలోని మిగిలిన శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేస్తాం. ఎవరైనా దాతలు ముందుకొస్తే వారందరితో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి.. అన్ని శ్మశానాలను అభివృద్ధి చేస్తాం. జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పార్టీసీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *