MachilipatnamLocal News
April 21, 2026
జిల్లా

భారత జనాభా గణన 2027 – డిజిటల్ విధానంలో వివరాల నమోదుపై అవగాహన

  • April 20, 2026
  • 0 min read
[addtoany]
భారత జనాభా గణన 2027 – డిజిటల్ విధానంలో వివరాల నమోదుపై అవగాహన
మచిలీపట్నం :
 
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న జనగణన–2027 ప్రక్రియలో భాగంగా, ఈసారి విప్లవాత్మక మార్పులు చేపట్టడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి కే చంద్రశేఖరరావు వెల్లడించారు. గతంలో మాన్యువల్‌గా జరిగిన ఈ ప్రక్రియను, దేశ చరిత్రలో మొదటిసారిగా పూర్తిస్థాయి ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జనగణన – స్వీయ గణన ఆన్లైన్ విధానంపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, గతంలో మాన్యువల్ విధానంలో నిర్వహించిన జనగణన ప్రక్రియ దేశ చరిత్రలో మొదటిసారిగా ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 15 రోజుల పాటు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) సదుపాయం కల్పించామని, దీని ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఎన్యుమరేటర్లు ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా వివరాలను సేకరిస్తారని, ప్రజలు కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలని సూచించారు. జనగణన ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైందని, తొలి రోజున ప్రజా ప్రతినిధులు, తదుపరి రోజున అధికారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
 
కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి ఆన్లైన్ విధానంలో స్వీయ గణన చేసుకునే విధానాన్ని ఆచరణాత్మకంగా డిజిటల్ స్క్రీన్ పై చూపించి అధికారులకు అవగాహన కల్పించారు.
 
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజా, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్రబాబు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *