MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

అగ్ని ప్రమాద నివారణ చర్యల పై అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు

  • April 16, 2026
  • 0 min read
అగ్ని ప్రమాద నివారణ చర్యల పై అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు
మచిలీపట్నం :
 
అగ్నిమాపక వారోత్సవములలో భాగంగా మూడొవ రోజు గురువారం మచిలీపట్నంలో పలు అపార్ట్ మెంట్స్ ప్రజలకు అగ్నిప్రమాద నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి అవగాహన నిర్వహించారు. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ప్రజలకు అగ్నిమాపక అధికారులు ప్రమాద నివారణ కరపత్రాలను పంపిణీ చేశారు. 
 
ప్రతి నివాసం వద్ద అగ్నిమాపక ప్రమాద నివారణ లో అత్యవసరంగా సంప్రదించాల్సిన నెంబర్లను పోస్టర్ రూపంలో అంటించారు. గృహాలలో ఫైర్ సేఫ్టీ పై మహిళలకు అవగాహనా సదస్సును నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది రసాయనిక అగ్నిమాపక సాధనములతో అగ్నిప్రమాదములను ఎలా నియంత్రించాలో డెమో చేసి చూపించారు. అలానే అగ్ని ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో మహిళలతో ప్రదర్శన చేయించారు. ఈ కార్యక్రమం లో సహాయ జిల్లా అగ్ని మాపక అధికారి వారు ఎ. రమణ రెడ్డి , ఏ. వేంకటేశ్వర రావు , పి జకరయ్య , కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *