MachilipatnamLocal News
April 16, 2026
జిల్లా

కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు

  • April 16, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు
మచిలీపట్నం :
 
కృష్ణాజిల్లాలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల విద్యార్థులు ఇంటర్మీడియట్ – 2026 ఫలితాలలో అద్భుత విజయాలు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్  ఫలితాలలో జిల్లావ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 133 మంది హాజరయ్యారు. వీరిలో 116 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 87% గా నమోదు చేసుకున్నారు. 
జూనియర్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు   
ఎంపీసీ విభాగంలో చాముండేశ్వరి కుసుమ – 460/470 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, అవనిగడ్డ) 
ఏ ఎన్ పి విభాగంలో  ఎస్. మిరియం – 480/500 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, మచిలీపట్నం) ఎం.ఎల్.టి విభాగం బి. వర్షిని – 474/500 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, మచిలీపట్నం)
ఫస్ట్ ఇయర్‌లో 20 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచారు. 
సీనియర్ ఇంటర్మీడియట్ లో  మొత్తం  విద్యార్థులు 111 మంది హాజరవ్వగా వీరిలో 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 90% గా నమోదు చేసుకున్నారు. 
ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు 
ఎం పి హెచ్ డబ్ల్యు: ఎల్. షైనీ – 963/1000 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, గుడివాడ)
ఎం ఎల్ టి  విభాగంలో బి ఈశ్వరి నాగజ్యోతి – 962/1000 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, మచిలీపట్నం)
ఎం ఎల్ టి లో చంద్రిక – 958/1000 మార్కులు (ఎస్సీ బాలికల వసతి గృహం, గుడివాడ).
 
సెకండ్ ఇయర్‌లో 25 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఈ అద్భుత ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల్లో అమలు చేస్తున్న నాణ్యమైన బోధన, ప్రత్యేక శిక్షణ అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనం అని , ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె షాహిద్ బాబు విద్యార్థులను, ఉపాధ్యాయులను, హాస్టల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *