MachilipatnamLocal News
April 14, 2026
జిల్లా

‘నేస్తం బడికి రా’ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

  • April 14, 2026
  • 1 min read
[addtoany]
‘నేస్తం బడికి రా’ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం: 
 
2026 – 27 విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్చే లక్ష్యంతో నేస్తం బడికి రా అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభిస్తోంది. పిల్లలు ఉండవలసింది బడిలో కానీ పనిలో కాదు అనే లక్ష్యంతో ప్రభుత్వం వినూత్నంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. దానిలో భాగంగా ‘నేస్తం బడికి రా’ పోస్టర్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆవిష్కరించారు. నేస్తం బడికి రా విధివిధానాలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించడం జరుగుతుందని డీఈవో యువి సుబ్బారావు తెలిపారు. 
మంగళవారం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ‘నేస్తం బడికిరా’ విద్యా వారోత్సవాలు పోస్టర్  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మచిలీపట్నం ఏ ఎల్ ఎస్ కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము 15.4.2026 నుండి 22.4.2026 విద్యా వారోత్సవాలు నిర్వహించాలన్నారు. 15.04.2026 న పాఠశాల, గ్రామ మండల స్థాయిలలో ర్యాలీలు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించవలసిందిగా తెలియజేశారు. 16.04.2026 నుండి 22.04.2026 వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవలసినదిగా జిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *