[addtoany]
మచిలీపట్నం :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరికీ కావలసిన వ్యక్తి అని సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తొలుత నగరంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు విచ్చేసి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ చైర్మన్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదనీ భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరినీ అంబేద్కర్ వారసులుగానే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ స్థాయికి మనమందరం రాగలిగామంటే వారిచ్చినటువంటి భాగ్యమేనన్నారు. కొంతమంది ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే సామాజిక అసమానతల మీద చేసినటువంటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని.అంబేద్కర్ కూడా అదే బాటలో నడిచి విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారన్నారు. . ఆనాడు అనేక కష్టాలు అనుభవించి కూడా.
మరి మనకు రాజ్యాంగం రాయడానికి ఆయన
చాలా రాజ్యాంగాలను ఉపాసన పట్టారన్నారు. మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్నాయన్నారు. . వీటినన్నిటిని కూడా మేళవించి ఒక చక్కటి రాజ్యాంగం రాయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిలకడగా ఉన్నామన్నారు. వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. . సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరొకరికి చేయి అందించి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నారు. మచిలీపట్నంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అనుకోని పరిస్థితులలో పనులు ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి బడ్జెట్లో నిధులు కేటాయించుకుని ఎంపీ, సి ఎస్ ఆర్ నిధులతో త్వరలో అంబేద్కర్ భవనం నిర్మాణ పనులు చేపడతామన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ. అంబేద్కర్ మన దేశానికి మాత్రమే మేధావి కాదు. ప్రపంచంలో మేధావులు ఎవరు ఉన్నారు అని పెద్ద యూనివర్సిటీలు సర్వే చేసిన దాంట్లో మొదటి స్థానంలో అంబేద్కర్ నిలిచారన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గత 10 వేల సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రపంచానికి సేవలందించిన పెద్ద పెద్ద పండితులు 100 మంది మేకర్స్ ఆఫ్ యూనివర్స్ అని ఒక జాబితా తయారు చేస్తే దాంట్లో నాలుగో స్థానం అంబేద్కర్ కు ఇవ్వడం జరిగిందన్నారు. అంబేద్కర్ రచించిన ఒక పుస్తకం కొలంబియా యూనివర్సిటీలో ఒక పాఠ్యపుస్తకంగా ఈరోజు కూడా తరగతులు చేస్తున్నారంటే మనకెంతో గర్వకారణమన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషినీ ప్రతి మేధావిని కూడా ప్రభావితం చేసే అంత గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు..ఆయన ఆ స్థాయికి చదువు వల్లనే చేరుకోగలిగారన్నారు. ఆయన చదివినంత చదువు ఎవరూ కూడా భవిష్యత్తులోనూ చదవలేరు, గతంలోనూ ఎవరూ చదివి ఉండరని అనిపిస్తుందన్నారు. ఒక్కసారి ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఇబ్బంది లేకుండా కూడా కొనసాగుతుందంటే అందుకు కారణం మన రాజ్యాంగం ఎంతో పటిష్టమైన గొప్ప రాజ్యాంగం అన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకులే కాకుండా ఆర్థికవేత్తగా కూడా వ్యవహరించారన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన 64 శాస్త్రాల్లో నిపుణులని, 9 భాషల్లో పట్టు ఉందనీ. దాదాపు ప్రపంచంలో ఉన్న 21 ధర్మాల్ని ఆయన సరిపోల్చి లోతుగా అధ్యయనం చేశారన్నారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో అస్పృశ్యత, కుల వివక్షకు గురయ్యారన్నారు. మన జీవితాలలో అస్పృశ్యత అనేది లేకుండా అందరూ సమానంగా గౌరించబడేలాగా రాజ్యాంగాన్ని నిర్మించగలిగారన్నారు. చదువు ద్వారా అస్పృశ్యతను నిర్మూలించవచ్చనీ, ఉన్నత శిఖరాలకు చేరవచ్చనీ. నిమ్న కులములో పుట్టిన కూడా చదువుకోవడం వల్ల ఆయన రాజ్యాంగ నిర్మాణానికి సారధ్యం వహించారన్నారు. . ఆయన రాజ్యాంగంలో రాసినట్లు అస్పృశ్యత నిర్మూలన కోసం విద్య అనేదాన్ని తప్పనిసరి చేశారన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా చదువుకోవాలనీ. ఒకవేళ చదువుకోవడానికి వాళ్ళు గనక ఇష్టపడకపోతే బలవంతంగానైనా చదివించాలనీ. రాజ్యాంగంలో ఉందన్నారు. . దాన్ని ఉపయోగించుకొని. అందరినీ విద్యావంతులుగా తయారు చేయాలన్నారు. . ఎక్కడ ఏ లోపాలు ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పార్లమెంటు సభ్యులు బాలసౌరి సహకారంతో బందరులో అంబేద్కర్ భవన నిర్మాణం త్వరలో చేపడుతామన్నారు.
రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్నో కష్టాలు పడి చదువుకున్నారని, ఆయన పడినటువంటి బాధలు, కష్టాలు ఈ సమాజంలో ఎవరూ పడకూడదనీ ఈ దేశం స్వేచ్ఛా వాయువులో ఎవరి హక్కులు వాళ్ళకు ఉండాలని చెప్పి భావించి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడన్నారు. . అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనందరం కూడా మన హక్కులు, నిధులు, విధులు సక్రమంగా ఈ రోజున ఏ ఇబ్బందులు లేకుండా వెళ్తున్నామంటే దానికిడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణమని చెప్పి వారి ఏ ఆశయంతో రాజ్యాంగ రచన చేశారో, ఈ సమాజంలో అందరూ సమానత్వంగా ఉండాలని, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్లాలని ఏదైతే భావించారో, దాన్ని ఆదర్శంగా తీసుకున్న మహానుభావుడు అన్న నందమూరి తారకరామారావు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో మరి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా.ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్లో ఆవిష్కరించడం, భారతరత్న రావడం జరిగిందన్నారు.
రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రసరాజు రాసిన అద్భుతమైన పాట ..వెలివేసిన చీకటిలో వీధి దీపమా, విసిరేసిన శూన్యంలో ఇంద్రచాపమా….నీ చూపులు దేశానికి గొడుగులు. నీ అడుగులు వివక్షతకు పిడుగులు. అంటూ ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా జరుపుతున్నాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆయన్ని స్మరించుకోవడం గౌరవించుకోవడం అంటే ఆ వ్యక్తి సమాజానికి, దేశానికి చేసినటువంటి మంచి ఆయన వల్ల ఈ దేశం ఎంత ముందుకు వెళ్ళిందో ఆయన్ని నిరంతరం కూడా మనం గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం అన్నారు. నిజంగా కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ప్రపంచంలోనే జనాభాపరంగా పెద్ద దేశం మరి భారతదేశం ఒక దేశం కాదు ఒక ఖండం అంటే వివిధ మతాలు, వివిధ సంస్కృతులు, వివిధ కులాలు, వివిధ జాతులు ఉన్నటువంటి దేశం. ఏ దేశానికైనా రాజ్యాంగం రాయటం సులభం. కానీ మన దేశానికి రాజ్యాంగం రాయటం అంటే ఆయన మరి ఎంత కష్టపడ్డాడో దేశం నలుమూలలా తిరిగి ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో ఈ దేశంలో ఎవరు ఏమిటి? అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగం ఏంటి? దానివల్ల వాళ్ళు ఏ విధంగా లబ్ది పొందుతున్నారు? మనకు ఏ విధంగా కావాలని అన్వేషించి నిజంగా ఇన్ని విభిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక్క తాటి మీద పెట్టగలిగిన వ్యక్తి అంటే అది అంబేద్కర్ కి సాధ్యమైందన్నారు,
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని , జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుమ్మడి విద్యాసాగర్, అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్, విశ్రాంత లెక్చరర్ మేరీ కృప బాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్
మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆదినారాయణ , ఎస్సీ నాయకులు బాలాజీ, వేముల కోటేశ్వరరావు, తదితర అధికారులు, అనధికారులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

