MachilipatnamLocal News
April 16, 2026
మచిలీపట్నం

అవోపా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం

  • April 12, 2026
  • 0 min read
[addtoany]
అవోపా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం
మచిలీపట్నం :
 
ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ అన్నారు. స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ లోని శ్రీరాముల విగ్రహం వద్ద ఆదివారం అవోపా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ  జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బాబా ప్రసాద్ మాట్లాడుతూ మండు వేసవిలో పాదచారులకు, వాహనంపై వెళ్ళు వారి దాహార్తి తీర్చడం అభినందనీయమన్నారు. పూర్వ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అవోపా అధ్యక్షుడు డీఎస్వి రమణమూర్తి, కార్యదర్శి గోళ్ళ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు తుళ్లూరి కోదండ వరప్రసాదరావు, పులవర్తి శ్రీనివాసరావు, ఎస్టి రామారావు, ఏబీవీఆర్ ప్రసాద్, కొల్లూరి రామ మోహన రావు, కారుమూరి రాజేంద్రప్రసాద్, నంబూరి గోపాలకృష్ణ, నంబూరి చలపతిరావు, పెసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *