ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన గొడవకు సంబంధించి ఇనగుదురు పోలీస్ స్టేషన్ సిబ్బంది క్రింద విధంగా వివరాలు తెలియచేసారు.
10 ఏప్రిల్ 2026 న సుమారు మధ్యాహ్నం 03:30 గంటల సమయంలో మచిలీపట్నం చలరస్తా సెంటర్ సమీపంలో గణేశ్ భవన్ దగ్గర పాత గొడవలు కారణంగా ముద్దాయి వక్కలగడ్డ సాయి బాబు @ వెంకట సాయి (వయసు 25 సంవత్సరాలు) అనే వ్యక్తి, బాధితుడైన చల్లపల్లి పవన్ కుమార్ ను చంపాలనే ఉద్దేశ్యంతో ముందుగా గొడవ పెట్టుకుని, అక్కడ ఉన్న కర్రతో దాడి చేసి, అనంతరం తన వెంట తీసుకువచ్చిన పదునైన బ్లేడ్/కత్తి వంటి ఆయుధంతో బాధితుని హత్య చేయాలనే ఉద్దేశంతో తీవ్రంగా దాడి చేసినాడు. ఈ దాడిలో బాధితునికి ముఖం, మెడ, ఛాతి మరియు పొట్ట ప్రాంతాలలో రక్త గాయాలు అయ్యాయి. బాధితుడుని అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఇనగుదురు పోలీస్ వారు క్రైమ్ నం. 60/2026 u/s 109(1) BNS-2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు క్రమంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలకమైన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తేదీ 11 ఏప్రిల్ 2026 న ముద్దాయిని పట్టుకొని, అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన అడ్జస్ట్మెంట్ బ్లేడ్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా, న్యాయమూర్తి అతనిని 14 రోజుల రిమాండ్ కు పంపినారు.