ప్రతి విద్యార్థి చిన్నపటి నుండి సేవ కార్యక్రమాలు చేయటం అలవాటు చేసుకోవాలని ఎవరైతే సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అటువంటి విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి పొందుతారని ఇటువంటి మంచి మంచి సేవ కార్యక్రమాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులే పిల్లల్ని ప్రభావితం చేసి ఆ దిసగా ముందుకు తీసుకువెళ్లాలని స్థానిక మచిలీపట్నం నాగార్జున హై స్కూల్లో పరోపకరి సోషల్ సర్వీస్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలొ జిల్లా గిరిజన సంక్షేమ శాఖధికారి ముదిగొండ ఫణి దూర్జటి ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు సందేశమిచ్చారు.
తదనంతరం చింతగుంటపాలెం వార్పు దగ్గర నివాసం ఉంటున్నటువంటి 25 కుటుంబాల వారికి 10రోజులకి సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు, నూనె పాకెట్లు, కూరగాయలు అందించారు. ఈ మొత్తం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వయంగా ఏర్పాటు చేసినవి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కె దివ్య నాగాంజని ఉపాధ్యాయులు కేశవ, రామకృష్ణ, మరియూ స్పెషల్ సర్వీస్ క్లబ్ విద్యార్థులు , విద్యా సంస్థ అధినేత వి సుందరరామ్ తదితరులు పాల్గొన్నారు.