మచిలీపట్నం :
పెద్దకరగ్రహారము, క్యాంప్ బెల్ పేట గ్రామంలో విబిజి రాంజీ స్కీం ఉపాధి హామి పథకం పనులను
పరిశీలించిన బిజెపి నాయకులు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వి బి జి రాంజీ వికసిత్భారత్ పనికి ఉపాధి కార్యక్రమము మచిలీపట్నం మండలం కరగ్రహారం పంచాయతీ క్యాంప్ బెల్ పేట గ్రామంలో వందరోజుల పనిని 125 రోజులకు పెంచిన సందర్భంగా ఏప్రిల్ ఒకటి నుంచి చట్టబద్ధత చేస్తున్నటువంటి ఈ పథకం ఉపాధి హామీ కార్మికులకు తోడ్పాటుగా గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విశేషమైనటువంటి ప్రజా సంక్షేమం కోరి ఇస్తున్నటువంటి పథకాలను తెలియడం కోసం అవగాహన కల్పిస్తున్నామన్నారు. పనులు పరిశీలన నిర్వహించిన జిల్లా కన్వీనర్ జి వి నగరాయలు, జిల్లా బిజెపి అధ్యక్షులు తాతినేని శ్రీరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్ర రావు ముఖ్య పరిశీలకులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంచర్లపల్లి వెంకట రామారావు, సేలం సుబ్బారావు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ప్రసన్న కుమార్, ఉప్పాల హరి, సలాది రామకృష్ణ , ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు గురువింద పల్లి విజయబాబు, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.