MachilipatnamLocal News
April 9, 2026
మచిలీపట్నం

గ్రామ ప్రధాన రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి కొల్లు

  • April 9, 2026
  • 0 min read
[addtoany]
గ్రామ ప్రధాన రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి కొల్లు
మచిలీపట్నం :
 
కృష్ణా జిల్లా బందరు మండలం వాడపాలెం పంచాయతీ వెంకట దుర్గాంబాపురంలో గురువారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. రామాలయం సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా విని వినతులు స్వీకరించాను. గ్రామ ప్రధాన రహదారి అభివృద్ధికి ₹1.35 కోట్లు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసిన ఆనందం నాకు మరింత బాధ్యతను గుర్తు చేసింది అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి, పిల్లల సౌకర్యాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
రేషన్ బియ్యం పొందడంలో ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామస్తుల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *