MachilipatnamLocal News
April 9, 2026
మచిలీపట్నం

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • April 6, 2026
  • 0 min read
[addtoany]
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
 మచిలీపట్నం :
 
 మచిలీపట్నం భారతీయజనతా పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో తొలుత అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, వక్తలు మాట్లాడుతూ 1980 సంవత్సరం ఏప్రిల్ 6 తేదీ నాడు ముంబై నగరం బాంద్రా ఏరియాలో 80 వేలమంది కార్యకర్తల సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం చాలా ఘనంగా జరిగి, అటల్ బిహారీ వాజపేయి ని ప్రధమ అధ్యక్షులు గా ఎన్నుకున్నారు.
ఆనాటి నుండి ఈనాటి వరకు వాజ్ పాయ్ , లాల్ కృష్ణ అద్వానీ తదితర నాయకుల నాయకత్వంలో గ్రామీణ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెంది వాజ్ పాయ్ మొదటి ప్రధాని గా అంత్యోదయ, స్వర్ణ చతుర్భుజి, రోడ్ , సాగర్, ఎయిర్ కనెక్ట్ వీలతో సుపరిపాలన అందించారన్నారు.
గత పుష్కర కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ భారత్ దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూ ప్రపంచ పటంలో అతి పెద్ద పార్టీగా దేశ రక్షణ, మేకిన్ ఇండియా , అవినీతి రహిత సుపరిపాలన తో  ప్రపంచం లోనే 3వ ఆర్థిక శక్తిగా అగ్రభాగాన నిలిపారని, ఇది మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీ రామ్, నాయకులు రామినేని వెంకటకృష్ణ, కూనపరెడ్డి శ్రీనివాస్, వల్లూరి శ్రీమన్నారాయణ, పంతం గజేంద్ర, చలంచర్ల పద్మరాజు, జిల్లా నాయకులు వల్లూరిపల్లి రమణ, పోలన అశోక్, పుప్పాల రాము, పామర్తి రామకృష్ణ, తుంగల గిరి, గంటా సతీష్, వీరమల్లు అభినందన, సలాది రామకృష్ణ, సూరి శెట్టి హరికృష్ణ, ధూళిపాళ శ్రీ రామచంద్ర మూర్తి , వివిధ మోర్చల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితర మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *