MachilipatnamLocal News
April 9, 2026
జిల్లా

కృష్ణా జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న డీకే బాలాజికి అభినందనలు

  • April 4, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణా జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న డీకే బాలాజికి అభినందనలు
కలెక్టరేట్‌లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు
 
మచిలీపట్నం: 
 
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకు కలెక్టరేట్ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఉద్యోగులు కేక్ కట్ చేసి, కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా పరిపాలనలో సమర్థవంతమైన నాయకత్వం, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం, ప్రభుత్వ పథకాల అమలులో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ విశేషంగా కృషి చేస్తున్నారని ఉద్యోగులు ఈ సందర్భంగా అభినందించారు. జిల్లాలో ప్రజా సేవ, పరిపాలనా పారదర్శకత, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్ చూపుతున్న అంకితభావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
 
కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, సహాయ కలెక్టర్ ఫర్హిన్ జాహిద్, బందరు ఆర్డీవో కే సాంబశివరావు, కలెక్టరేట్ ఏవో రాధిక, కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *