MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

దళిత డప్పు కళాకారుని పై దాడి హేయమైన చర్య

  • April 4, 2026
  • 0 min read
దళిత డప్పు కళాకారుని పై దాడి హేయమైన చర్య
మచిలీపట్నం :
 
మచిలీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 3 వ వార్డు లో మరిడి తల్లి పండుగలో డప్పు కళాకారుని పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెయ్యి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్. ఈ సందర్భంగా కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ అయ్యన పాత్రుడు స్పీకర్ పదవిలో ఉండి చట్టాని రక్షించవలసిన బాధ్యత మరచి అహంకారపూరితంగా డప్పు కళాకారుని పై దాడి హేయమైన చర్య అని దళితులపై దాడికి పాల్పడిన అయ్యన్నపాత్రుని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా వాటిని నివారించవలచిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు,లోకేష్ లు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో తీవ్రమైన నష్టం తప్పదు అని హెచ్చరించారు. అదేవిధముగా డప్పు కళాకారునికి ఎస్ సి ఎస్ టీ చట్టం ప్రకారం నష్టం పరిహారం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేస్తామన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *