MachilipatnamLocal News
April 9, 2026
కృష్ణా యూనివర్సిటీ

పాలనదక్షుడు జగ్జీవన్ రామ్ – కృష్ణా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ కె రాంజీ

  • April 4, 2026
  • 0 min read
[addtoany]
పాలనదక్షుడు జగ్జీవన్ రామ్ – కృష్ణా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ కె రాంజీ
మచిలీపట్నం : 
      నాలుగు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్ గా, మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రి గా పనిచేసిన అనుభవశాలి బాబూ జాగ్జీవన్ రామ్ అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ శ్లాఘించారు. శనివారం మాజీ ఊపప్రదాని బాబూ జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకల ను కృష్ణా విశ్వవిద్యాలయం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక శాఖల ను సమర్థవంతంగా నిర్వహించి పాలనాదక్షుడు గా పేరు గడించారన్నారు. తొలుత బాబూ జాగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, పరీక్షల నియంత్రణ అధికారి డా. వీర బ్రహ్మచారి, ఆచార్య మారుతి, డా. పద్మజ, పలువురు సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *