MachilipatnamLocal News
April 3, 2026
మచిలీపట్నం

ఘనంగా మాజీమంత్రి నడకుదుటి నరసింహారావు పంచమ వర్ధంతి

  • April 1, 2026
  • 1 min read
[addtoany]
ఘనంగా మాజీమంత్రి నడకుదుటి నరసింహారావు పంచమ వర్ధంతి
– జీవితాంతం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపించారు
– మత్స్యకార పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఆయన ఘనతే
– మచిలీపట్నం అభివృద్ధికి గుర్తుగా హార్బర్‌కు నరసింహరావు పేరు హర్షణీయం
– టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నరసింహరావు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
 
మచిలీపట్నం : 
 
సామాన్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు నడకుదిటి నరసింహరావు అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన నరసింహరావు వర్ధంతి కార్యక్రమంలో అంజలి ఘటించారు. ఎన్నో అవమానాలు, ఒడిదొడుకులు ఎదుర్కొని నిత్యం శ్రమించి ఎదిగారు. అర్బన్ బ్యాంకు ఛైర్మన్ స్థాయిలో నరసింహరావు  చేసిన నిస్వార్ధ సేవలను గుర్తించి ఎమ్మెల్యేగా సీటు ఇచ్చి మంత్రిగా చేశారు. మంత్రిగా బాద్యతలు స్వీకరించిన రోజు నుండి మత్స్యకారుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారన్నారు. మత్స్యకార పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్సియల్ హాస్టల్స్ ఆయన ఘనతే అన్నారు .మత్స్యకారుల పడవలకు డీజిల్ సబ్సిడీ నరసింహరావు పోరాట ఫలితమన్నారు. అదే సమయంలో వేటకు వెళ్లే పడవలకు శాటిలైట్ అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు.
 
నియోజకవర్గంలో సీసీ రోడ్లు, భారత్ సాల్ట్ పరిశ్రమ, ఇళ్ల స్థలాలు కేటాయించి అభివృద్ధికి తోడుగా నిలిచారు. అదే సమయంలో డ్రైవర్స్ కాలనీ, రుద్రవరంలో అనేక కాలనీలు నిర్మించిన ఘనత నరసింహరావుదే అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మచిలీపట్నం హార్బర్‌కు నరసింహరావు పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు.వీలైనంత త్వరగా హార్బర్ పనులు పూర్తి చేసి అక్కడ నరసింహరావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నా రు.
 
నరసింహరావు స్పూర్తితోనే నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్, బందరు పోర్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. తీర ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపి నరసింహరావు ఆశయాలను సాకారం చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.  
 
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ మాట్లాడుతూ మనం సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత ప్రజల కోసం కేటాయించాలని నాన్న నేర్పించారు. ఆయన స్పూర్తితోనే అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.  అందరికీ గౌరవం కలిగేలా అభివృద్ధి పనులు చేయాలనే లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నామన్నారు.మన నాయకుడు చంద్రబాబు నాయుడు తో ఉంటున్నందుకు మనమంతా గర్వపడాలన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా కూడా సీనియర్లతో కలిసి పని చేసినపుడే విజయం సాధించగలం అన్నారు.
 
ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *